WGL: పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ కోసం ఆస్తి యాజమాన్య సర్టిఫికెట్‌పై నకిలీ సంతకం, స్టాంపులు ఉపయోగించినట్లు సమాచారం. సర్టిఫికెట్ తాను జారీ చేయలేదని జీపీ సెక్రటరీ మాలతి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.