SRPT: రెజ్లింగ్‌లో హుజూర్నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి కందుకూరి ఉపేందర్ సత్తా చాటాడు. హైదరాబాద్‌లో జరిగిన అండర్-17 పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి, మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. వెల్లటూరుకు చెందిన ఉపేందర్‌ను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. నేషనల్ మీట్లో రాణించాలని వారు ఆకాంక్షించారు.