MNCL: జన్నారం మండలంలో పిచ్చి కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. పోన్కల్, లింగాయపల్లి, చింతలపల్లి, కిష్టాపూర్ తదితర గ్రామాలలో పిచ్చికుక్కలు గడిచిన రెండు నెలల్లో ఐదు సార్లు ప్రజలపై దాడి చేశాయి. ఈ సంఘటనలో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కుక్కలను చంపితే కేసులు అవుతుండడంతో అధికారులు కూడా ఏమి చేయలేకపోతున్నారు.