నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు జరిగిన ప్రెస్మీట్లో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు. మాదిగల జనాభా 10 శాతానికి పైగా ఉన్నప్పటికీ, ఏబీసీడీ వర్గీకరణలో కేవలం 9 శాతం రిజర్వేషన్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. తమకు రావాల్సిన అదనపు 2 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలన్నారు.