SRCL: దేశ వ్యాప్తంగా చేపడుతున్న జనాగణన జనాభా లెక్కల నమోదుకు ప్రజలు సహకరించాలని, అలాగే స్వీయ గణన ద్వారా మీ పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ చేసుకోవాలని రుద్రంగి తహసీల్దార్ పుష్పలత కోరారు. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం, అభివృద్ధి చెందాలంటే ముందుగా జనాభా లెక్కలకు సహకరించాలన్నారు.