MNCL: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయనున్న విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి మే 11 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. 100 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించబడుతుందని, ఆసక్తిగల వారు కళాశాలలో సంప్రదించాలన్నారు.