SRCL: జనగణన 2027కు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్లను గుర్తించి సీఎంఎస్ఎస్ పోర్టల్లో నమోదు చేయాలని సెన్సస్ డైరెక్టర్ భారతీ హోలికేరి ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన రెవెన్యూ గ్రామాలు, వార్డుల వారీగా అడ్మినిస్ట్రేటివ్, హౌజ్ లిస్టింగ్ బ్లాక్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు.