JGL: ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే లక్ష్యంగా జగిత్యాల మండలం తిప్పన్నపేటలో ‘బడిబాట’ నిర్వహించారు. సర్పంచ్ తిరుపతి, ప్రధానోపాధ్యా యులు వెంకటరమణ, సుచరిత ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలను బడికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.