KNR: కమిషనరేట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం ప్రకటించారు. సాధారణ పౌరులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కఠిన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.