BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాకకు చెందిన నూనవత్ నవీన్‌పై నమోదైన పోక్సో కేసులో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష నిన్న విధించింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు నిరూపితమవడంతో పాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లు పోలీసులు తెలిపారు.