HYD: హెచ్-సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం. 2, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఈ నెల 27 నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనుల కారణంగా రద్దీ ఏర్పడే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.