జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘Arrive Alive’ కార్యక్రమంలో భాగంగా ZPHS ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులతో రహదారి భద్రతపై బుధవారం వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్న వయసులోనే పిల్లలకు ట్రాఫిక్ నియమాలపై, సురక్షితమైన ప్రయాణంపై అవగాహన కలుగుతుందని మల్లాపూర్ ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.