JN: గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో రూ.20 లక్షలతో ఇటీవల అంతర్గత సీసీ రోడ్లను నిర్మించారు. ఈ రోడ్లను MLA బుధవారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కడియం కోరారు.