MBNR : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వైద్యులు పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిశారు. డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి అందించిన విశేష సేవలకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందదాయకం ఎంపీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.