MDCL: నాచారం సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.21 కోట్ల మేరకు పన్ను వసూలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం లక్ష్యం రూ.59.63 కోట్లుగా నిర్ణయించారు. లక్ష్య సాధన కోసం అధికారులు ప్రత్యేక సేకరణ డ్రైవ్లు చేపట్టారు. బకాయిలు ఉన్న ఆస్తి యజమానులకు నోటీసులు జారీ చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.