BPT: పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని ఖచ్చితత్వంతో నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రక్రియను పరిశీలించారు. 750 మంది ఉపాధ్యాయులు 1,77,819 పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.