ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోంది. అయితే, టాస్ గెలిచి ఉంటే తామూ బౌలింగ్ తీసుకొనేవాళ్లమని కెప్టెన్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు. తమ జట్టులో అద్భుతమైన యంగ్ బౌలర్లు ఉన్నారని తెలిపాడు. SRH తరఫున సలీల్ అరోరా బరిలోకి దిగుతున్నాడు. ప్రఫుల్ హింజ్ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు.