ADB: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగుల కోసం పీఆర్సీని త్వరలో ప్రకటించాలని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదిలాబాద్ రీజియన్ అధ్యక్షుడు సాంబశివ కోరారు. ఈ విషయమై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.