NZB: వేల్పూర్ విశ్వబ్రాహ్మణ సంఘం వద్ద ఎస్సై బి. సంజీవ్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు కూడా శిక్ష పడుతుందని హెచ్చరించారు.