ADB: భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామం నుంచి గుబిడి వరకు కొనసాగుతున్న రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని మండల నాయకుడు కేమ శ్రీకాంత్ అన్నారు. పనులను నిలిపివేసిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని ఎస్సై విక్రమ్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని విన్నవించారు.