KMR: కామారెడ్డిలో న్యూ బస్టాండ్లో ఫిబ్రవరిలో జరిగిన శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం సెల్ ఫోన్, రూ. 300 కోసం నిందితుడు ఆకాష్ నాగురావ్ (మహారాష్ట్ర) దాడి చేసి హత్య చేసినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.