TG: PCC చీఫ్, AICC కార్యదర్శి ఎదుటే నిర్మల్ మాజీ DCC చీఫ్ శ్రీహరిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్లో ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పారు. జిల్లాలో తమకు ఎలాంటి సహాయ, సహకారాలు అందడం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు కూడా స్థానిక బీజేపీ ఎమ్మెల్యేకే సహకరిస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ను కాపాడుకోవాలని సూచించారు.