JN: పాలకుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ మార్ట్ సూపర్ మార్కెట్‌ను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. సూపర్ మార్కెట్ ప్రారంభం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, రోజువారీ అవసరాల సరుకులు ఒకే చోట లభించడంతో సమయం ఆదా అవుతుందని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు అందించి ప్రజల విశ్వాసం పొందాలన్నారు.