HNK: GWMC 60వ డివిజన్ పరిధిలోని వడ్డెపల్లిలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మేయర్ గుండు సుధారాణితో కలిసి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్కరు అభివృద్ధికి సహకరించాలని MLA కోరారు.