PDPL: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం కోల్ బెల్ట్ ఏరియా మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్గేట్ వద్ద, రామగుండం కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద కాసేపు ఆగి పార్టీ శ్రేణులతో ముచ్చటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాక కోసం పార్టీ నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.