WNP: పేకాట ఆడుతున్న 5 గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై రిషికేష్ తెలిపారు. వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన 5 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారంతో రైడ్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. పేకాట స్థవరంలో పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.14,520 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.