MNCL: హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి CM కప్ కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన కరాటే క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. నస్పూరు చెందిన అన్విత 59 కేజీల విభాగంలో కాంస్య పతకం, బెల్లంపల్లికి చెందిన అభిషేక్ 75 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు జిల్లా కరాటే సంఘం ప్రధాన కార్యదర్శి శివమహేష్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను పలువురు అభినందించారు.