JN: పోతిరెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజలు, రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సమస్యల సత్వర పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.