GDWL: ఉండవెల్లి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన కురువ సుమలత శస్త్రచికిత్స నిమిత్తం ఎమ్మెల్యే విజయుడు రూ. 5 లక్షల విలువైన ఎల్వోసీ (LOC) పత్రాన్ని అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడం తమ బాధ్యతని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.