KMM: ఖమ్మం జిల్లాకు నేడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ రానున్నట్లు ఆ పార్టీ నేతలు గురువారం ప్రకటించారు. ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం పొందిన హైకోర్టు ఏజీపీ చాట్ల నాగమణి కుమార్ తల్లి చాట్ల సులోచన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్నారని అన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.