ADB: విద్యార్థులు మూఢ నమ్మకాలకు దూరంగా ఉండి శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. పట్టణంలోని అర్బన్, గ్రామీణ కేజీబీవీలలో ఖగోళ, అంతరిక్ష ప్రయోగశాలను అధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలను, ప్రాచీన, ఆధునిక ఖగోళ శాస్త్ర నమూనాలను ఉపయోగించి తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.