WGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం సంక్షేమ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో అపర్ణ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు “ప్రతిభ ఉత్సవం” పేరిట వ్యాసరచన, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.