ASF: జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. వేధింపులు, హింస ఎదురైతే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని ఆమె సూచించారు. షీ టీమ్స్ ద్వారా నిరంతరం నిఘా ఉంచుతూ, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామని ఆమె స్పష్టం చేశారు.