MHBD: పూజల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురవి మండలం రాజోలు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాడ్పోడ్ ప్రతాప్ 2025లో ఒక వ్యక్తి వద్ద పూజలు చేస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.