KMR: ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామంలో జరిగిన భారీ దొంగతనం కేసును ఎల్లారెడ్డి పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో ఇనుప పెట్టెలో దాచిన సుమారు 40 తులాల వెండి ఆభరణాలు, 6 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.16 లక్షల నగదును దొంగిలించిన కిలాడీ దొంగల జంటను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.