కరీంనగర్ నగరంలోని చింతకుంట వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్లో పడి హరీశ్ కుమార్ (15) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోగా, స్థానికుల సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రికి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడి మృతితో విషాదం అలుముకుంది.