సిద్దిపేట పట్టణంలోని పలు ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెనుక ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి, డార్మెటరీ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో నేరుగా మాట్లాడి భోజన నాణ్యత, వసతులపై ఆరా తీశారు. చదువుపై దృష్టి సారించాలని కలెక్టర్ భరోసా ఇచ్చారు.