TG: సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 115 మంది ఎస్ఐలు, 1500 మంది కానిస్టేబుళ్లతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మేడిగడ్డ వద్ద ఇవాళ ఉదయం నుంచే పోలీస్ బలగాలు మోహరించాయి. సీఎం రేవంత్ రెడ్డి మొదట కాళేశ్వరం దేవస్థానం వద్ద భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.