స్వతంత్ర భారత చరిత్రలో ఇంద్రవెల్లి మారణకాండ ఒక చీకటి అధ్యాయం. 1981 ఏప్రిల్ 20న తమ హక్కుల కోసం గిరిజనులు నిర్వహించిన సభపై పోలీసులు జరిపిన కాల్పుల్లో సుమారు 60 మంది అమరులయ్యారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటం.. జలియన్ వాలా బాగ్ తరహా మారణకాండగా నిలిచింది. ఆ అమరులకు గుర్తుగా కాల్పులు జరిగిన ప్రాంతంలో స్థూపాన్ని నిర్మించారు.