WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బిక్షపతి ఆదివారం రాత్రి గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందారు. భారత సైన్యంలో సేవలందించిన భిక్షపతి అనంతరం గ్రామంలో రేషన్ డీలర్‌గా స్థిరపడ్డారు. బిక్షపతి మరణం పట్ల పలువురు అధికారులు, మాజీ సైనికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బిక్షపతి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.