తూ.గో: గోకవరం మండలం గంగంపాలెం గ్రామానికి చెందిన అరిసపు వేధాన్షీ అన్నవరంలో జరిగిన అండర్-9 రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయంతో జూలైలో జరిగే నేషనల్ ఛాంపియన్షిప్కు రాష్ట్రం తరఫున అర్హత సాధించినట్లు కోచ్ ఐఎం రవితేజ తెలిపారు. చిన్నారి సాధించిన ఈ విజయంపై కుటుంబసభ్యులు, గ్రామ ప్రజలు, మండల నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ వేధాన్షీని అభినందించారు.