MHBD: తేనె అనుకుని ప్రమాదవశాత్తు పురుగుమందు తాగి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హిడ్మాసోరి(46)అనే కూలీ మృతి చెందాడు. కురవి మండలం బలపాల గ్రామంలో మామిడి కాయలు కోయడానికి వచ్చిన కూలీ.. శనివారం రాత్రి పొరపాటున విషం తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఎస్సై జయ కుమార్ రూ.5,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.