BHPL: భూపాలపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం కల్లు గీత కార్మికులకు కాటమయ్య కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కల్లు గీత కార్మికుల భద్రత ఎంతో ముఖ్యమని, వారికి అవసరమైన రక్షణ పరికరాలు వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని MLA అన్నారు.