SKLM: నరసన్నపేటలో తాటి ముంజులకు మంచి గిరాకీ లభిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే లభించే వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ సందర్భంగా కల్లు గీత కార్మికుడు మాట్లాడుతూ.. వీటిలో పోషక విలువలు ఎన్నో ఉన్నాయన్నారు. రూ.60-70కి విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే తాటి చెట్లు కనుమరుగవడంతో మరింత డిమాండు పెరుగుతుందని పేర్కొన్నారు.