RR: షాద్నగర్ పట్టణంలోని 6వ వార్డు హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలను సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. గంగను ధరణికి తెచ్చేందుకు ఆయన చేసిన అలుపెరుగని పోరాటమని, అవి నేటి యువతకు ఒక గొప్ప పాఠం అన్నారు. ఆ పట్టుదలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని పేర్కొన్నారు.