ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలలో ఇవాళ పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ తిరుపతి పర్యటించి పారిశుధ్య కార్మికుల హాజరు పట్టికను పరిశీలించి, పనులు పర్యవేక్షించారు. డ్రైనేజీల నిర్వహణ, చెత్త సేకరణ, రహదారుల స్వీపింగ్, తడి/పొడి చెత్త సేకరణ నిర్వహించినట్లు పేర్కొన్నారు.