JN: శాతపురం క్రాస్ రోడ్డు వద్ద రైతులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతుందని, మక్కల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు మద్దతు ధరను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.