వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ ప్రజా ఆస్తులు ధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ తెలిపారు. VKB ఆర్టీసీ బస్సు డిపో సహా పరిసర ప్రాంతాలలో భద్రత ఏర్పాట్లు, ఇతర పరిస్థితులను పర్యవేక్షించారు. కఠిన చర్యలు అమలు చేయాలని, రవాణా సేవలను అడ్డుకుంటే చర్యలు చేపట్టాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశించారు.