MHBD: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని మరిపెడ మున్సిపల్ ఛైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి సూచించారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంతో పాటు అబ్బాయిపాలెం, బాల్ని ధర్మారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోందన్నారు.