NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎడమ కాలువకు నీటి విడుదల ఇవాళ నిలిపివేశారు. ప్రస్తుతం కుడి, ఎడమ, వరద కాలువలకు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 526.40 అడుగులగా నీటిమట్టం నిల్వ ఉంది. ఎగువ నుంచి అంతే మొత్తంలో నీరు సాగర్‌కు వచ్చి చేరుతుంది.